అంతర పంటలు / INTERCROP
అంతర పంటలు / INTERCROP
అంతర పంటలు / INTERCROP
Explore Moreఅంతర పంటల నిష్పత్తి / INTERCROP RATIO
Explore Moreవేరుశనగలో కందిని అంతర పంటగా సాగు చేసుకోవడం / Cultivating Redgram as an intercrop with groundnut
Explore Moreఅంతర పంటలు / INTERCROP
అంతర పంటలు
తక్కువ కాలపరిమితి గల మినుము, పెసర, తృణ ధాన్యాలు, వేరుశనగలను అంతర పంటలుగా వేసుకోవచ్చు.
INTERCROP
Short-term crops such as Greengram, Blackgram, cereals, and Groundnut can be intercropped.
అంతర పంటల నిష్పత్తి / INTERCROP RATIO

అంతర పంటల నిష్పత్తి
కంది + జొన్న/మొక్కజొన్న/సజ్జ (1:2), కంది+పెసర/మినుము/ సోయాచిక్కుడు/ వేరుశనగ (1:7)

INTERCROP RATIO
Redgram + Sorghum/Maize/Bajra (1:2), Redgram+Greengram/Blackgram/ Soyabean/ Groundnut (1:7)
వేరుశనగలో కందిని అంతర పంటగా సాగు చేసుకోవడం / Cultivating Redgram as an intercrop with groundnut
వేరుశనగలో కందిని అంతర పంటగా సాగు చేసుకోవడం
అనంత ఆటోమేటిక్ వేరుశనగ విత్తు పరికరంతో 8 వరుసల వేరుశనగ, 1 వరుస కంది ఒకేసారి విత్తుకోవచ్చు. విత్తిన 30 రోజులప్పుడు, ప్రతి వరుసలో తేమ సంరక్షణ సాళ్ళు వేసుకోవడం వల్ల వేరుశనగ మరియు కంది పంటల్లో దిగుబడి పెరుగుతుంది.
Cultivating Redgram as an intercrop with groundnut
With the Ananta Automatic Groundnut Seeder, 8 rows of groundnut and 1 row of yam can be sown at a time. 30 days after sowing, applying moisture-conserving mulch in each row increases the yield of groundnut and yam crops.
ద్రవ రూపంలో రూపొందించబడిన జీవన ఎరువులు / Liquid Bio fertilizers
ద్రవ రూపంలో రూపొందించబడిన జీవన ఎరువులు
పొడి రూపములో లభ్యమవుతున్న పైన వివరించిన జీవన ఎరువులలో ఉన్న సాధక బాధలను గుర్తించి అమరావతి వ్యవసాయ పరిశోధనా స్థానంలో పరిశోధనా ఫలితముగా వెలువడిన ద్రవ రూపంలోని జీవన ఎరువులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొనుచున్నవి.
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించిన ఈ ద్రవ రూపంలోని జీవన ఎరువులు పొడి రూపంలో తయారవుతున్న జీవనఎరువుల కన్నా ఎంతో మంచి ఫలితాలు అందజేయుచున్నవి.
ద్రవ రూపములోనున్న ఈ జీవన ఎరువులు తయారుచేయునప్పుడు అనేక సేంద్రియ రసాయన పదార్ధములు కలిపి ఎక్కువ కాలము నిల్వ ఉండే విధముగా తయారు చేయడమైనది.
అధిక సంఖ్యలో పంట పొలమునకు కావలసిన ఈ జీవన ఎరువుల బ్యాక్టీరియా కణములు (10/మి.లీ.) లభ్యమగును. ఈ ద్రవరూప జీవన ఎరువులు రాబోయే కాలంలో మంచి నాణ్యత కలిగి సత్ఫలితములను అందించును.
వాడవలసిన మోతాదు :
ఒక ఎకరం పొలమునకు 300 మి.లీ. నుండి 500మి.లీ. వరకు ప్రతి ఒక్కొక్క రకపు జీవన ఎరువును మిశ్రమ ద్రావణముగా చేసి వాడవలయును.
వాడవలసిన పద్ధతి :
విత్తనమునకు పట్టించే పద్ధతి: ఒక కిలో విత్తనమునకు 5-6 మి.లీ. జీవన ఎరువును సమాన మోతాదులో 10% చెక్కెర లేదా బెల్లం ద్రావణముతో కలిపి విత్తనము చుట్టు సమానముగా పట్టునట్లు కలపవలయును. తరువాత 10 నిమిషములు నీడలో ఆరబెట్టి విత్తుకొనవలయును.
భూమిలో వేసే పద్ధతి :
ఒక ఎకరము పొలమునకు 300 మి.లీ. నుండి 500 మి.లీ. ప్రతి ఒక్కొక్క రకపు జీవన ఎరువును తీసుకొని 10 లీటర్ల సాధారణ నీటితో కలిపి, దాదాపు 100-200 కిలోల పశువుల ఎరువుతో గాని వానపాముల ఎరుపుతో గాని లేదా మరి ఏ ఇతర సేంద్రియ ఎరువుతో గాని కలిపి విత్తనము నాటే సాళ్ళలో పడేటట్లు వేసుకొనవలెను.
ఎట్టి పరిస్థితులలోను పంట పొలములో చేపట్టే మొదటి అంతరకృషి చేయుటకు ముందుగా జీవన ఎరువులు వాడుట ముగించవలెను,
ద్రవ రూపములో నున్న ఈ జీవన ఎరువుల వలన లాభములు :
- ఎక్కువ కాలము అనగా 12 నుండి 18 నెలలు నిల్వ ఉండును.
- గడువు తేదీ వరకు అధిక సంఖ్యలో బ్యాక్టీరియా ఉండును.
- ఇతర బ్యాక్టీరియా కలుషితము ఉండదు.
- తేలికగా ఎక్కువ భూమి విస్తీర్ణమునకు తక్కువ సమయంలో ఉపయోగించవచ్చును.
- తేలికగా పంట యొక్క వ్రేళ్ళ చుట్టు ఉన్న వాతావరణముతో సమన్వయ సంబంధము ఏర్పరచుకొని అధిక సంఖ్యలో పెరుగును.
జీవన ఎరువు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- జీవన ఎరువు ప్యాకెట్ ఎండ వేడి తగలని నీడ ప్రదేశంలో నిల్వచేయవలెను.
- రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైనదై ఉండవలెను.
- ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్‌పై ఉన్న గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించవలెను.
- రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకొనేటప్పుడు విధిగా 24-48 గం|| వ్యవధి ఉండవలెను.
- రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడరాదు.
- సమర్థవంతంగా పనిచేయుటకు నాణ్యతగల కల్చర్‌ను వాడుకొనవలెను
పైరుకు నిర్దేశించబడిన జీవన ఎరువును పొలములో తగినంత తేమ ఉన్నప్పుడు వాడుకోవలెను. సేంద్రియ ఎరువుతో జీవన ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవలెను. జీవన ఎరువులను వాడేప్పుడు లేదా మొదటి సారిగా వినియోగించేటపుడు సంబంధిత శాస్త్రవేత్తలను గాని/ వ్యవసాయ అధికారులను గాని సంప్రదించి వారి సలహా మేరకు వాడుకోవడం మంచిది.
జీవన ఎరువుల వాడకం వలన కలిగే ఉపయోగములు
వాతావరణ కాలుష్యంను అరికట్టవచ్చు.
వాతావరణంలోను, నేలలోని, మొక్కలు తమంత తాము ఉపయోగించుకోలేని పోషకాలను వాటికి అందుబాటులోకి తెచ్చును.
హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమై పెరుగుదల వేగంగాను మరియు ఆరోగ్యకరంగా ఉండును.
నేల నుండి సంక్రమించే తెగుళ్ళను కొంతమేర అరికట్టవచ్చును.
నేల భౌతికలక్షణాలు బాగుపడును మరియు భూసారం అభివృద్ది చెందును.
రైతులకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి అధికమగును.
రసాయన ఎరువుల దిగుమతికయ్యే విదేశీ మారక ద్రవ్యం ఆదా అగును.
సాధారణ దిగుబడులు 10-20 శాతం వరకు పెరుగును. దీనితో పాటు 20-25 శాతం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చును.
ప్రస్తుత పరిశోధనలో ఉన్న మిశ్రమ జీవన ఎరువుల వాడకం ద్వారా అధిక దిగుబడులు సాధింవచ్చని తేలినది. ఈ మిశ్రమ జీవన ఎరువులో ఒక నత్రజని బాక్టీరియా, ఒక ఫాస్పేట్ను కరిగించే బాక్టీరియా మరియు ఒక పి.జి.పి.ఆర్. బాక్టీరియా కలసి ఒకే ప్యాకెట్‌గా రూపొందించబడుచున్నవి.
Liquid Bio fertilizers
Recognizing the shortcomings of the above-described living fertilizers available in dry form, liquid-form living fertilizers, which have emerged as a result of research at the Amaravati Agricultural Research Center, are gaining great importance.
This liquid form of living fertilizer, developed by Acharya N.G. Ranga Agricultural University, is providing much better results than the living fertilizers produced in powder form.
When preparing this liquid living fertilizer, it is made by mixing several organic chemicals to ensure long-term storage.
A large number of these living fertilizer bacterial cells (10/ml) are available for the crop field. These liquid living fertilizers will have good quality and provide good results in the coming time.
Dosage: For one acre of field, 300 ml to 500 ml of each type of live manure should be used as a mixed solution.
Method of application:
Seed dressing: For one kg of seed, mix 5-6 ml of live manure with equal quantity of 10% sugar or jaggery solution and mix it evenly around the seed. Then dry it in the shade for 10 minutes and sow.
Method of application in the soil:
For one acre of field, take 300 ml to 500 ml of each type of live manure and mix it with 10 liters of plain water, mix it with about 100-200 kg of cattle manure or earthworm droppings or any other organic fertilizer and apply it in the sowing holes.
Under no circumstances should the use of organic fertilizers be discontinued before the first inter-cultivation of the crop field.
Benefits of this liquid form of living fertilizer:
- Long shelf life i.e. 12 to 18 months.
- High number of bacteria present till the expiry date.
- No contamination by other bacteria.
- It can be easily applied to a large area of land in a short time.
- It easily forms a harmonious relationship with the environment around the roots of the crop and grows in large numbers.
- This bacteria can withstand high temperatures and other climatic conditions and grow.
- This technology can easily apply live fertilizers to more fields in less time, directly reaching the plant roots.
- Crop growth and production are high.
- These liquid organic fertilizers play a major role in providing the necessary nutrients to the crop in organic farming.
Precautions to be taken while using live manure:
- The live manure packet should be stored in a shady place away from the sun.
- The live manure packet used by the farmer should be appropriate for the crop.
- The live manure used should be used only within the expiry date on the packet.
- When treating seeds with chemicals, a period of 24-48 hours should be mandatory.
- Organic fertilizers should not be used together with chemical fertilizers.
- Quality culture should be used for effective work.
- Live manure specified for rice should be applied when there is sufficient moisture in the field.
- Live manure should be applied to the crop immediately after mixing with organic manure.
- When using living fertilizers or when using them for the first time, it is advisable to consult the relevant scientists/agricultural officials and use them as per their advice.
Benefits of using organic fertilizers
- Air pollution can be prevented.
- It makes nutrients available to plants in the atmosphere and soil that they cannot use on their own.
- Hormones and vitamins are available to the plant, making growth faster and healthier.
- Soil-borne pests can be controlled to some extent.
- Soil physical properties improve and soil fertility improves.
- Farmers will reduce the cost of chemical fertilizers and increase their profit margin.
- Foreign exchange used to import chemical fertilizers will be saved.
- General yields can increase by 10-20 percent. Along with this, the use of chemical fertilizers can be reduced by 20-25 percent.
- Current research has shown that higher yields can be achieved through the use of a combined live fertilizer. This combined live fertilizer contains a nitrogen-fixing bacteria, a phosphate-solubilizing bacteria, and a PGPR bacteria, all in a single
ఆంధ్రప్రదేశ్‌లో జీవన ఎరువులు లభ్యమయ్యే కేంద్రాలు / Biofertilizers available centres
ఆంధ్రప్రదేశ్‌లో జీవన ఎరువులు లభ్యమయ్యే కేంద్రాలు
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి, చిత్తూరు జిల్లా
ఉద్యావన పరిశోధనా స్థానం, వై.యస్.ఆర్. హార్టికల్చర్ యూనివర్శిటీ, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా
వ్యవసాయ పరిశోధన స్థానం, అమరావతి, గుంటూరు జిల్లా
వ్యవసాయ పరిశోధనా స్థానం, ఊటుకూరు, వై.ఎస్.ఆర్. కడప జిల్లా
Biofertilizers available centres
Regional Agricultural Research Station, Tirupati, Chittoor District
Horticulture Research Station, YSR Horticulture University, Tadepalligudem, West Godavari District
Regional Agricultural Research Station, Anakapalle, Visakhapatnam District
Agricultural Research Station, Amaravati, Guntur District
Agricultural Research Station, Ootukuru, Y.S.R. Kadapa District.