జీవన ఎరువులు / Biofertilizers
జీవన ఎరువులు / Biofertilizers

నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు/ Nitrogen fixing biofertilizers
Explore More
భాస్వరంను స్థిరీకరించే జీవన ఎరువులు/ Phosphorus fixing biofertilizers
Explore More
పొటాషియం మొబిలైజర్స్ / Potassium Immobiilzers
Explore Moreనత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు/ Nitrogen fixing biofertilizers

నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు
లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించు జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైన కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనమునకు పట్టించి ఉపయోగించవలెను.దీనిని ఉపయోగించుట వలన మొక్క వ్రేళ్ళపై లేత గులాబి రంగు కలిగిన బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెలలో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించును.
ఈ రైజోబియం కల్చర్ ఒక్కొక్క పంటకు ప్రత్యేకమైన స్ట్రైన్ ఉండును. కావున రైతు ఏ పంట వేయునో ఆ పంటకు నిర్దేశించబడిన రైజోబియం మాత్రమే వాడవలను.
ఉపయోగించు విధానం :
100 మిల్లీ లీటర్ల నీటిలో 10 గ్రా.ల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడరును కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను.
ఈ చల్లార్చిన ద్రావణం 10 కి.ల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రా. ల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను.
ఈ ప్రక్రియను రైతులు పాలిథన్ సంచినిగాని, ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించి చేసుకొనవచ్చును. పట్టించిన విత్తనంను 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తరువాత పొలంలో నాటుకొనవలెను.
రైజోబియం జీవన ఎరువు తప్పనిసరిగా వాడవల్సిన ఆవశ్యకత
కొత్తగా లెగ్యూమ్ జాతి పంటను పొలంలో వేసేటప్పుడు గతంలో లెగ్యూమ్ జాతి పంట వేసినప్పటికి తగినన్ని వేరు బుడిపెలు (నాడ్యూల్స్) ఏర్పడనప్పుడు
పంట మార్పిడి పద్ధతిలో లెగ్యూమ్ జాతి పంటకు ముందు మరియు ఏ ఇతర జాతి పంటలను వాడియున్నయెడల వాతావరణ పరిస్తితులు రైజోబియం (జీవన ఎరువు) బ్రతికి ఉండుటకు అనకూలించనప్పుడు అనగా: ఎ. అధిక ఆమ్ల / క్షార భూములు అయిన యెడల బి. మురుగు నీరు నిల్వ ఉన్న పొలంలో (వరదలు వచ్చినప్పుడు) సి. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో

Nitrogen fixing biofertilizers
It should be used as a nitrogen-fixing living fertilizer for legume crops, i.e. pulses. Rhizobium culture should be applied to the seeds for important legume crops such as yam, chickpea, gram, and gram, and for oilseed crops such as peanuts and soybeans.
Its use causes the formation of light pink nodules on the plant stems. The rhizobium present in these nodules fixes nitrogen from the air and makes it available to the plants.
This rhizobium culture has a specific strain for each crop. Therefore, the farmer should use only the rhizobium specified for the crop he is planting.
Directions for use:
10 grams of sugar or jaggery or ganji powder should be mixed in 100 ml of water, boiled for 10 minutes and allowed to cool.
This cooled solution should be sprinkled on 10 kg of seeds and 200 g of Rhizobium culture powder should be mixed well, taking care to form a layer around the seeds.
Farmers can do this process using a polythene bag or a plastic tub. The soaked seeds should be dried in the shade for 10 minutes and then planted in the field.
The necessity of using Rhizobium live fertilizer
When planting a new legume crop in the field When a legume crop has been planted in the past but has not formed enough root nodules
In crop rotation, before a legume crop and before any other crop, when climatic conditions are not conducive to the survival of rhizobium (living fertilizer), i.e.: A. In case of highly acidic/alkaline soils B. In fields where sewage water is stored (during floods) C. In areas with high temperatures
భాస్వరంను స్థిరీకరించే జీవన ఎరువులు/ Phosphorus fixing biofertilizers

భాస్వరంను స్థిరీకరించే జీవన ఎరువులు
పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరి కొద్ది రోజుల వ్యవధిలో భూమి యొక్క ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరపు రూపంలోనికి మారిపోవును. ఉదాహరణకు భూమి ఆమ్లగుణము కలిగియున్నచో, వేసిన భాస్వరం, ఐరన్ లేదా అల్యూమినియం ఫాస్పేట్లుగా మారిపోయి మొక్కకు లభ్యం కాకుండా ఉండును. ఒకవేళ భూమి క్షార గుణము కలిగి ఉన్న, వేసిన భాస్వరం, కాల్షియం లేదా మెగ్నీషియం ఫాస్పేట్గా మారి మొకుకు లభ్యంకాదు. ఈ పరిస్థితులలో భాస్వరంనకు సంబంధించి జీవన ఎరువులు వేసినచో లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరంను మొక్కకు లభ్యమయ్యే స్థితికి తెచ్చును. వీటిలో ముఖ్యంగా వాడుకలో ఉన్నవి
- ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బాక్టీరియా (ఫాస్ఫో బాక్టీరియా)
- ఫాస్పేట్ సాల్యుబలైజింగ్ పంగై (ఫాస్పోఫంగై)
ఫాస్పోబాక్టీరియా : ఈ జీవన ఎరువు ముఖ్యంగా బాసిల్లస్ మెగథీరియంతో గాని, సూడోమోనాసన్ను గాని ఉపయోగించి తయారు చేయబడును. ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను, లభ్యమగు రూపంలోకి మార్చును. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకొనవచ్చు. ఈ జీవన ఎరువు సమర్ధవంతంగా పనిచేయుటకు సేంద్రియ కర్బనము అత్యవసరం. కావున ఈ జీవన ఎరువుతో తప్పని సరిగా సేంద్రియ ఎరువును వాడవలెను. ఈ జీవన ఎరువు మొక్కకు భాస్వరంను లభ్యపరుచుటయే గాక మొక్కలకు కావాల్సిన హార్మోన్లను కూడా సరఫరా చేయును. మొక్కలకు రోగ నిరోధక శక్తిని పెంపొందించును. దీని వల్ల పంట దిగుబడి పెరుగును.
వాడే విధానం : ఎకరాకు 20 కిలోల ఫాస్పోబాక్టర్‌ను, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగాని, మొక్క నాటినప్పుడు గాని సాళ్ళలో పడేటట్లు వేసుకొనవెలను.
2. ఫాస్పోఫంగై : ఈ జీవన ఎరువు ఆస్పర్జిల్లస్ అవమోరి లేదా పెనిసీలియం డిజిటోటము ఉపయోగించి తయారు చేయబడును. ఫాస్పోబాక్టీరియం కన్నా శక్తివంతమైన జీవన ఎరువు. దీనిని అన్ని పంటలకు వాడుకొనవచ్చును. ఇది నేలలో చేసే జీవప్రక్రియ ద్వారా ఎక్కువ శాతం లభ్య భాస్వరం మొక్కకు దొరుకును.
వాడే విధానం : 2.0 కిలోల జీవన ఎరువును 200 కిలోల సేంద్రియపు ఎరువుతో కలిపి ఒక ఎకరం నేలకు విత్తనం నాటి సాళ్ళలో పడేటట్లు వేసుకోవలెను.
3. ఫాస్పేటు మొబిలైజింగ్ మైకోరైజా (వేమ్): ఇది శిలీంధ్రపు జాతికి చెందిన జీవన ఎరువు. మొక్క వ్రేళ్ళు చొరలేని భూమి అడుగు పొరలలోనికి చొచ్చుకొనిపోయి మొక్కలకు ముఖ్యంగా భాస్వరంతోపాటు సూక్ష్మపోషకాలైన జింకు, కాపర్, సల్ఫర్, మాంగనీసు, ఇనుము మొదలగు వాటిని నీటితో సహా అందించును.
మైకోరైజా వాడిన మొక్కలలో నీటి ఎద్దడిని తట్టుకోవటం, రోగ నిరోధక శక్తి పెరగటం గమనించవచ్చు. భూమిలో నెమటోడ్ల బెడదను ఈ శిలీంధ్రం ద్వారా మొక్కలకు తప్పించవచ్చును. ఈ జీవన ఎరువు ముఖ్యంగా గ్లోమస్ లేదా గైగాస్పారా అనే శిలీంద్రములతో తయారవును.
వాడే విధానం : ఈ జీవన ఎరువుకు సరియైన నిర్ధిష్ట పరిమాణములు లేని కారణం వలన కనీసం 5 కిలోలను ఒక ఎకరం భూమికి వేయవలసి ఉంటుంది. తప్పనిసరిగా విత్తనం / మొక్క క్రింద మాత్రమే పడేటట్లు ఈ జీవన ఎరువును
మొక్క పెరుగుదలను అభివృద్ధి పరచే జీవన ఎరువు (పి.జి.పి.ఆర్.) : ఈ జీవన ఎరువు ఒక మిశ్రమ సముదాయంతో కూడుకున్నది. ముఖ్యంగా బాసిల్లస్ జాతి బాక్టీరియాలను మరియు సూడోమోనాస్ జాతి బ్యాక్టీరియాలను ఒక మిశ్రమంగా తయారుచేసి పి.జి.పి.ఆర్. జీవన ఎరువుగా అందించుచున్నారు. మొక్కకు పోషకాలు అందించుటతోపాటు ఈ జీవన ఎరువులు రోగనిరోధక శక్తిని పెంపొందించును. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను, విటమిన్లను అందించును. భూమిలోని మొక్కలకు, తెగుళ్ళు కలుగచేసే శిలీంద్రాలను పెరగకుండా అరికట్టును. వాటిలో కొన్నింటిని జీవనియంత్రణ కారులుగా నిర్దేశించడమైనది. వాడే విధానం : ఒక ఎకరాకు రెండు కిలోలు ఈ జీవన ఎరువును 200 కిలోలు పశువుల ఎరువుతోగాని, వానపాముల ఎరువుతోగాని విత్తనం నాటుకునే సమయంలో వెదజల్లవలెను. అవసరమైనప్పుడు ఒకసారి పైరుపై సాయంత్రపు వేళ పిచికారీ కూడా చేయవచ్చును. పిచికారీ ద్రావణములో ఏదైనా ఎమల్సిఫయిర్ (emulsifier) కలుపవలెను.

Phosphorus fixing biofertilizers
The available phosphorus applied to crops enters the soil and within a few days, depending on the soil's nitrogen content, is converted into various forms of unavailable phosphorus. For example, if the soil is acidic, the applied phosphorus will be converted to iron or aluminum phosphates and will not be available to the plant. If the soil is alkaline, the applied phosphorus will be converted to calcium or magnesium phosphates and will not be available to the plant. In these circumstances, applying living fertilizers related to phosphorus will make the unavailable phosphorus available to the plant. The most commonly used of these are:
- Phosphate-solubilizing bacteria (Phosphobacteria)
- Phosphate solubilizing fungi (Phosphofungi)
1. Phosphobacteria: This live fertilizer is mainly made using Bacillus megaterium or Pseudomonas. This live fertilizer converts phosphorus in the soil from a form unavailable to plants into a form available to them. This living fertilizer can be used for all crops. Organic carbon is essential for this living fertilizer to work effectively. Therefore, organic fertilizer should be used properly along with this living fertilizer. This living fertilizer not only provides phosphorus to the plant but also supplies the hormones required by the plants. It increases the immunity of the plants. Due to this, the crop yield increases.
Method of use: 20 kg of Phosphobacter per acre mixed with 200 kg of cattle manure should be applied in the furrows either in the fall or at the time of planting.
2. Phosphofungi: This live fertilizer is made using Aspergillus awamori or Penicillium digitatum. It is a more powerful live fertilizer than Phosphobacterium. It can be used for all crops. It makes most of the available phosphorus available to the plant through the biological process in the soil.
3. Phosphate-Mobilizing Mycorrhiza (VEM):
This is a living fertilizer from a fungus. It penetrates the soil layers where plant roots cannot penetrate and provides plants with essential nutrients, especially phosphorus, as well as micronutrients such as zinc, copper, sulfur, manganese, iron, etc., along with water.
Plants that use mycorrhizae are more resistant to water stress and have increased immunity. This fungus can protect plants from nematodes in the soil. This living fertilizer is mainly made from fungi called Glomus or Glomus.
Method of application:
Since there is no specific dosage for this live fertilizer, at least 5 kg should be applied per acre of land. This live fertilizer should be applied only under the seed/plant.
4. Plant Growth Promoting Live Fertilizer (PGPR):
This live fertilizer is a mixture of bacteria, especially Bacillus species and Pseudomonas species, which are prepared as a mixture and are provided as PGPR live fertilizer.
In addition to providing nutrients to the plant, these living fertilizers also boost the immune system and provide hormones and vitamins that are useful for plant growth.
They inhibit the growth of fungi that cause diseases in plants and soil. Some of them have been designated as biocontrol agents.
Method of use:
Two kg of this live manure per acre should be spread along with 200 kg of cattle manure or earthworm manure at the time of sowing. If necessary, it can also be sprayed once on the crop in the evening. Any emulsifier should be added to the spray solution.
పొటాషియం మొబిలైజర్స్ / Potassium Immobiilzers

పొటాషియం మొబిలైజర్స్
5. పొటాషియం మొబిలైజర్స్ : ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఇవి ఇటవల కాలంలోనే పరిగణలోనికి తీసుకొనబడినవి. వీటిలో ముఖ్యంగా “ఫ్రటూరియా అరాన్షియా” అనే బాక్టీరియా పొటాషియం మోబిలైజర్స్ ఇవ్వబడుచున్నది. దీనితోపాటు కొన్ని బాసిల్లస్ జాతులు కలిపి మిశ్రమంగా తయారు చేయుచున్నారు. వాడే విధానం : 2.0 కిలోల జీవన ఎరువును 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం భూమిపై వెదజల్లవలెను. నూనె పంటలలో దీని ప్రభావం బాగా కనబడుచున్నది

Potassium Immobiilzers
5. POTASIUM MOBILISERS:
This Bio fertilizer makes potassium available to the plant in the soil that is not available to the plant. These have been taken into consideration in recent times. Among these, the bacterial potassium mobilizers called “Fruituria arancia” are especially being given. In addition, some Bacillus species are being mixed together to make a mixture.
Method of use:
2.0 kg of live manure mixed with 200 kg of organic manure should be spread on one acre of land. Its effect is seen well in oil crops.