సూక్ష్మ పోషకాల లోపాలు - సవరణ / Micro nutrient Deficiencies and rectification
సూక్ష్మ పోషకాల లోపాలు - సవరణ / Micro nutrient Deficiencies and rectification

జింకు లోపము / Zinc deficiency
Explore More
ఇనుము లోపం / Iron deficiency
Explore Moreజింకు లోపము / Zinc deficiency

జింకు లోపము
అపరాలలో జింకు లోపము వల్ల మొక్కలు గిడసబారిపోయి లేత ఆకుపచ్చ లేదా తెలుపు మచ్చలు వచ్చి, ఆకులు చిన్నవిగా మారి, కణుపులు దగ్గరగా ఉండి మొక్క గుబురుగా ఆలస్యంగా పెరుగుతుంది.
కంది పంటలో జింక్ లోపించినచో మొక్కలు ముదురు ఆకుపచ్చ చారలతో కనిపిస్తాయి. ఆకులలో ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది.
మొక్కలు కురచగా ఉండి, కొమ్మలు మరియు ఆకుల పరిమాణం బాగా తగ్గి చిన్న ఆకులతో పువ్వు మాదిరిగా అనిపిస్తుంది.
పూత రావటం ఆలస్యం అవుతుంది. పూత మరియు పిందె రాలటం జరుగుతుంది. లోపం తీవ్రమైనప్పుడు ఈనెలు ఆకుపచ్చగా ఉండి మధ్యకు, పాలిపోయి లోపలికి ముడుచుకుంటాయి.
ఆకు అంచుల నుండి ఎండినట్లుగా, లోప తీవ్రతను బట్టి గోధుమ రంగులో నిర్జీవమైన మచ్చలు ఏర్పడి, ఆకు మొత్తం ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది.

Zinc deficiency
Zinc deficiency in legumes causes stunted growth, pale green or white spots, small leaves, close-packed nodes, and delayed growth.
If the redgram crop is deficient in zinc, the plants will appear with dark green stripes.
The leaves remain green on the edges while the center turns yellow.
Plants become stunted, and branches and leaves shrink in size, appearing like small flowers.
Flowering is delayed. Flowers and pods may drop prematurely. In severe deficiency, leaves that are green may turn pale and curl inward.
Depending on the severity, brown, lifeless spots form along the leaf edges, leading to the leaf drying out and falling off.
ఇనుము లోపం / Iron deficiency

ఇనుము లోపం
కంది పంటలో ఇనుము లోపం వలన మొదటగా లేత ఆకుల ఈనెల మధ్య భాగం తాత్కాలికంగా పాలిపోయి పసుపు రంగులోకి మారతాయి.
లోపం కొనసాగినా లేదా తీవ్రతరమైతే ఈనెల మధ్య భాగం ప్రకాశవంతమైన పసుపు రంగుకు మారుతుంది.
ఎగువ ఆకులలో ఈనెల మధ్య భాగం పసుపుగా మారటం అనేది ఇనుము లోపం యొక్క ప్రముఖ లక్షణం.
లోపం ఎక్కువైతే ఈనెలు పాలిపోయి, ఆకుల మొత్తం లేత ఆకుపచ్చ లేదా పసుపుగా మారి చివరికి కాగితం తెలుపు రంగులోకి మారుతుంది.
నివారణ: పంటలో లోపం రాకుండా ఒక హెక్టారుకు 10 కిలోల ఐరన్ చీలేట్ వాడాలి.
ఉదజని సూచిక ఆధారంగా ఐరన్ చీలేట్ ఎంచుకోవాలి.
పంటలో లోప లక్షణాలు కనిపించినపుడు అన్నభేది లీటరు నీటికి 5 గ్రా. చొప్పున, లేదా 0.5 గ్రా. చొప్పున ఉపయోగించాలి.
మెట్ట ప్రాంతాలలో భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు మినుము, పెసర పైర్లలో ఇనుపధాతు లోపం కనిపిస్తుంది.
లేత ఆకులలో ఈనెల మధ్య భాగం పసుపు వర్ణంలోకి మారి, ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి.
ఆకులు పసుపు రంగులోకి మారి నల్లని మచ్చలు ఏర్పడతాయి.
లోపం తీవ్రమైనప్పుడు ఆకులు మొత్తం తెల్లగా మారి ఎండిపోతాయి.
నివారణకు 1 లీటరు నీటిలో ఫెర్రస్ సల్ఫేట్ / అన్నభేది 2 గ్రా., నిమ్మ ఉప్పు 0.5 గ్రా., యూరియా 15 గ్రా. కలిపి, వారానికి రెండు సార్లు పిచికారి చేయాలి.
ఇతర పంటల్లో కూడా లేత ఆకుల్లో ఇదే విధమైన లక్షణాలు కనిపించి, మొక్క పెరుగుదల కుంటుపడుతుంది.

Iron deficiency
Iron deficiency in the redgram crop initially causes the midrib of young leaves to temporarily turn pale and yellow.
If the deficiency persists or becomes severe, the midrib will turn bright yellow.
The main symptom of iron deficiency is yellowing of the midrib, especially in the upper leaves.
When the deficiency is severe, the leaves also turn pale green or yellow, eventually becoming completely papery white.
To prevent deficiency, apply 10 kg of iron chelate per hectare.
Iron chelates should be selected based on the hydrogen index (pH).
If deficiency symptoms appear, apply 5 g of Annabhedi per liter of water or 0.5 g as required.
Iron deficiency is seen in the leaves and stems of the plants in the metta areas when the soil moisture is high.
In young leaves, the middle of the leaf turns yellow while the outer parts remain green.
The leaves turn yellow and black spots appear.
In severe cases, the entire leaf turns white and dries out.
For prevention, mix 2 g of ferrous sulphate/annabhedi, 0.5 g of lime salt, and 15 g of urea per liter of water and spray on the crop twice at weekly intervals.
Similar symptoms are seen in other crops as well, mainly in the young leaves, and the plant growth becomes stunted.