నీటి యాజమాన్యం / Water Management
నీటి యాజమాన్యం / Water Management

నీటి యాజమాన్యం
Explore More
Water Management
Explore Moreనీటి యాజమాన్యం
నీటి యాజమాన్యం
ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో రబీ కందికి 2 తేలిక పాటి తడులు ఇవ్వాలి. ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి, కాయదశలో మరోసారి ఇవ్వాలి.
Water management
In areas not affected by the northeast monsoon, rabi redgram should be given 2 light drenches. These drenches should be given once before bud drop and again during the Pod development stage.
కలుపు రాకుండా నివారించుకోవటానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
కలుపు రాకుండా నివారించుకోవటానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
నేల సమతలంగా లేని ప్రాంతాలలో కలుపు సమస్య ఎక్కువ. కాబట్టి పైరు విత్తేముందే నేలను చదును చేయాలి.
* వేసవిలో లోతు దుక్కులు దున్నటం వలన పొలంలో ఉన్న తుంగ, గరిక వంటి మొండిజాతి కలుపు నివారించవచ్చు.
* తొలకరి వర్షాలు మొదలైన వెంటనే నేలను వీలున్నన్ని ఎక్కువసార్లు గొర్రు, గుంటకలు వంటి పరికరాలతో దున్నటం వలన నేల పైపొరలలోని కలుపు విత్తనాలు చాలా వరకు మొలక దశలోనే అంతరించి, పంటతో పాటుగా వచ్చే కలుపు మొక్కలు చాలా వరకు తగ్గిపోతాయి.
* రైతులు సాగుచేసే భూములను ఎంతో జాగ్రత్తగా కలుపు లేకుండా చూసుకుంటారు. అంతే శ్రద్ధతో పొలంగట్లు, పొలాలకు వెళ్ళే డొంకలు, రోడ్ల ప్రక్క ప్రదేశాలలో కలుపు లేకుండా చూసుకుంటే కలుపు విత్తనం తయారి చాలా వరకు తగ్గిపోతుంది.
* గ్రామాలలో చెరువు గట్లు, కాలువ గట్లు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాలలో కలుపు మొక్కలు పెరగనీయకుండా చేసినపుడు పంట పొలాలలో కలుపు సమస్య తగ్గుతుంది.
* పశువుల ఎరువు పొలానికి వేసినపుడు పశువుల ఎరువులో ఉండే కలుపు విత్తనాల ద్వారా వచ్చే కలుపును నివారించుకోవటానికి, తొలకరి వర్షాలకు అవసరం మేరకు పొలాన్ని దున్ని ఎరువుతో పాటుగా వచ్చే కలుపు విత్తనాలు పైరు వేయకముందే మొలచి నశించేలా చేయాలి.
* కలుపు విత్తనాలు కలవకుండా పంట విత్తనాలు మాత్రమే విత్తేందుకు వాడాలి.
* పంట మొక్కల సాంద్రత పొలంలో సరిపడా ఉన్నపుడు కలుపు ఉదృతిని పైరు అడ్డుకుంటుంది.
* పంట విత్తనాలు చల్లటం కంటే, యంత్ర పరికరాలు ఉపయోగించి సిఫారసు చేసిన ఎడంతో, సిఫారసు మేరకు విత్తన మోతాదు పాటించి, సరిఅయిన పద్ధతిలో విత్తినపుడు కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.
* వేసవిలో పాలీథీన్ షీట్‌ను నేలపై అమర్చినపుడు నేల బాగా వేడెక్కి, నేలలో వున్న కలుపు విత్తనాలు నశించిపోతాయి.
* పైరు వేయటానికి కొంత సమయం ఉన్నపుడు పొలంలో పచ్చి రొట్ట పైర్లు సాగుచేసి కలుపు ఉదృతి తగ్గించుకోవటానికి అవకాశం ఉంది.
* డ్రిప్ పద్ధతిలో పంటలకు నీరు కట్టినపుడు పొలంలో కలుపు తక్కువగా ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని బట్టి నీరు కట్టడానికి డ్రిప్ పద్ధతి ఏర్పాటు చేసుకోవాలి.
* సాధారణ పద్ధతిలో నీటిని కట్టినపుడు పొలంలో నీరు నిలబడినపుడు కలుపు ఎక్కువగా ఆశించటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రిప్ అవకాశం లేని దగ్గర, పైపులు ఉపయోగించి, పొలంలో నీరు నిలబడకుండ పంటలకు నీరు అవసరం మేరకే పారించినపుడు కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.
* పైర్లకు అందించే ఎరువులు పొలంలో చల్లకుండా డ్రిప్ నీటి పారుదల సౌకర్యం ఉన్నపుడు డ్రిప్ ద్వారా, లేనపుడు మొక్కలకు దగ్గరలో మట్టి క్రింది పడేలా వేసినపుడు కూడా కలుపు ఉదృతిని తగ్గించుకోవచ్చు.
* పరాన్న బుక్కులైన కలుపు మొక్కలు (బంగారు తీగ, పొగమల్లె మొ॥) ఆశించే నేలలో వాటి మొలకకు, పెరుగుదలకు దోహదపడే పంటలు కొన్ని సంవత్సరాలు సాగుచేయకుండా ఉన్నపుడు పరాన్న బుక్కులైన కలుపు మొక్కలు పొలంలో నశించిపోయేలా చేయవచ్చు.
* పంటకోసిన తరువాత పొలంలో మిగిలిపోయే కలుపు మొక్కలను వెంటనే నాశనం చేయాలి. అలా చేయనప్పుడు, వాటి ద్వారా విత్తనం ఉత్పత్తి జరిగి తరువాత సాగు చేసే పైర్లలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది.
* పైరు విత్తేముందు లేక నాటేముందు నేలను పూర్తిగా పొలీథీన్ షీట్‌తో కప్పి, అవసరమైన దగ్గర పోలీథీన్ షీటికు బెజ్జాలు వేసి పైరు విత్తి లేక నాటి, పైరులో కలుపు మొలవకుండా చేయవచ్చు. ఈ పద్ధతిలో ఖర్చు అధికం కాబట్టి, అధిక ఆదాయం ఇచ్చే పంటల సాగులో పాటించవచ్చు.
Management practices to be adopted to prevent weeds:
Weeds are more common in areas where the soil is not level. Therefore, the soil should be leveled before sowing the pea.
Deep ploughing in summer can prevent stubborn weeds like tunga and garika from growing in the field.
By plowing the soil as often as possible with tools such as a harrow and a harrow as soon as the early rains begin, most of the weed seeds in the topsoil are destroyed at the seedling stage, and the weeds that grow along with the crop are greatly reduced.
Weed problems in crop fields will be reduced if weed control is done in villages, around ponds, canals, playgrounds, and vacant lots.
To prevent weeds from growing in the manure, the field should be plowed as needed during the early rains to ensure that the weed seeds that come with the manure germinate and die before the manure is applied.
Only crop seeds should be used for sowing without mixing with weed seeds.
Peat prevents weed growth when the crop plant density is sufficient in the field.
Weed problems are less when the recommended seed rate is followed and the recommended seed rate is followed and the sowing method is suitable, rather than by scattering the crop seeds using mechanical equipment.
* When a polythene sheet is placed on the ground in summer, the soil heats up and the weed seeds in the soil are destroyed.
When there is some time left for sowing, it is possible to cultivate green roti peas in the field and reduce the weed growth.
* When crops are watered using drip irrigation, there are fewer weeds in the field. Therefore, drip irrigation should be established as per the opportunity..
* When irrigating in the normal way, there is a possibility of weeds growing more when water stagnates in the field. Therefore, where drip irrigation is not possible, using pipes and distributing water to the crops only as needed without stagnant water in the field, the weed problem is less..
Fertilizers for seedlings can be applied to the field instead of being sprinkled on it, using drip irrigation if there is a drip irrigation system, or by applying it to the soil near the plants if there is none, to reduce weed growth..
Parasitic weeds (golden vine, cotton grass, etc.) can be killed off in a field if crops that support their germination and growth are left uncultivated for a few years in the soil they are growing in.
Weeds remaining in the field after harvesting should be destroyed immediately. If this is not done, they will produce seeds and cause more weed problems in the later crops.
Before sowing or planting peas, the soil can be completely covered with a polythene sheet and the peas can be sown or planted by placing pegs on the polythene sheet where necessary, preventing weeds from growing in the peas. Since this method is expensive, it can be used in the cultivation of high-income crops.