పురుగులు / PESTS
పురుగులు / PESTS

కాయ తొలుచు పురుగు / (శనగపచ్చపురుగు) / Gram pod borer
Explore More
కాయ ఈగ / Pod fly
Explore More
కాయ రసం పీల్చే పురుగులు / Pod bugs
Explore More
మారుకా మచ్చల పురుగు / Spotted pod borer
Explore More
ఆకుచుట్టు పురుగు / Redgram leaf Roller
Explore Moreసమగ్ర సస్యరక్షణ / Integrated Pest Management
Explore Moreవైరస్ ని ఉపయోగించి చీడపురుగులను నియంత్రించటం / Controlling pests using viruses
Explore Moreకాయ తొలుచు పురుగు / (శనగపచ్చపురుగు) / Gram pod borer

కాయ తొలుచు పురుగు / (శనగపచ్చపురుగు)
ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ, ఒక కాయ నుండి మరో కాయకు అశిస్తుంది.
దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలి.

Gram pod borer
This insect bores into the pods during the budding and fruiting stages, feeding on the seeds and moving from one pod to another.
Comprehensive crop protection measures must be followed to prevent this.
కాయ ఈగ / Pod fly

కాయ ఈగ
కాయ ఈగ ఆశించినపుడు నష్టం బయటకు కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తిని వేస్తాయి. ఈ పురుగు అన్ని దశలనూ కాయలోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది.
తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గ్రుడ్లు పెడుతుంది. కావున పిందె దశలో 5% వేపగింజల కషాయం పిచికారి చేసినట్లయితే గ్రుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు.
గింజ గట్టిపడే దశలో మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేక డైమిథోయేట్ 2.0 మి.లీ లేక ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ. లేక థయాక్లోప్రిడ్ 0.7 మి.లీ. లేక థయోమిథాక్సామ్ 25 డబ్ల్యు. జి. 0.4 గ్రా. లేక ల్యుఫెన్యురాన్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

Pod fly
The damage caused by the pod fly is not visible. Its larvae remain inside the fruit and eat the seeds. This insect completes all its stages inside the fruit and only the mother insect emerges.
The queen lays eggs on the pods during the early stages of development. Therefore, spraying with 5% neem seed extract during the development stage can prevent egg laying.
During the seed hardening stage, spray Monocrotophos 1.6 ml. or Dimethoate 2.0 ml. or Profenophos 2.0 ml. or Thiacloprid 0.7 ml. or Thiomethoxam 25 WG. G. 0.4 g. or Lufenuron 1.0 ml. per liter of water.
కాయ రసం పీల్చే పురుగులు / Pod bugs

కాయ రసం పీల్చే పురుగులు
పిల్ల, పెద్ద పురుగులు కాయలలోని గింజల నుండి రసం పీల్చుట వలన గింజలు నొక్కులుగా / పొక్కు గింజలుగా మారి లేత దశలోనే ఎండిపోవడం వలన దిగుబడి తగ్గడమే కాకుండా మొలక శాతం తగ్గిపోతుంది.
ఆ గింజలు మొలకెత్తవు. నివారణకు డైమిథోయేట్ 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేక డెల్టామిత్రిన్ 0.9 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Pod bugs
The young and adult insects suck the sap from the seeds in the pods, causing the seeds to become shriveled/blistered and dry out at the tender stage, which not only reduces the yield but also reduces the germination percentage.
Those seeds will not germinate. For prevention, spray with Dimethoate 2.0 ml. or Monocrotophos 1.6 ml. or Deltamethrin 0.9 ml. per liter of water.
మారుకా మచ్చల పురుగు / Spotted pod borer

మారుకా మచ్చల పురుగు
దీనిని వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడ అంటారు. ఈ పురుగు యొక్క ఒకటి రెండు దశలు పూమొగ్గల లోపలే ఉండి తిని వేస్తాయి.
తరువాత దశలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కలిపి గూడుగా చేసుకొని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయలలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తుంది.
దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1గ్రా. లేదా థయోడికార్బ్ 1గ్రా. లేదా నొవాల్యురాన్ 1.0 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా ల్యాండా సైహలోత్రిన్ 1 మి.లీ. లేదా ప్లుబెండిఎమైడ్ 0.2 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి మందులు మార్చి వారము రోజులకొకసారి పిచికారీ చేయాలి.

Spotted pod borer
It is also commonly known as the flower budworm or the budworm or the powdery mildew. One or two instars of this insect live inside the flower buds and feed on them.
In the later stage, it makes a nest of young leaves, flowers, young shoots and pods, makes a small hole at the bottom of the pod, enters and eats the seeds inside the pods, hollowing them out.
To prevent this, apply chlorpyrifos 2.5 ml. or acephate 1 g. or thiodicarb 1 g. or novaluron 1.0 ml. or spinosad 0.3 ml. Or Lamda Cyhalothrin 1 ml. or Plubendiamide 0.2 ml. or Emamectin Benzoate 0.4 g. or Chlorantraniliprole 0.3 ml. Mix in a liter of water and spray once a week by changing the medicines. .
ఆకుచుట్టు పురుగు / Redgram leaf Roller
ఆకుచుట్టు పురుగు
కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు అశిస్తుంది. ఆకులను, పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది.
దీని ఉదృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Redgram leaf Roller
The leafroller moth attacks during the bud growth stage. It wraps around the leaves and the flower stalk and eats it inside.
If its infestation is high, spray 1.6 ml. Monocrotophos or 2.0 ml. Quinalphos per liter of water to prevent it.
సమగ్ర సస్యరక్షణ / Integrated Pest Management
సమగ్ర సస్యరక్షణ ( కాయ తొలుచు పురుగు / (శనగపచ్చపురుగు) )
వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినటానికి వీలవుతుంది.
ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి.
ఖరీఫ్ లో అంతర పంటగా 7 సాళ్ళు, రబీలో 3 సాళ్ళు పెసర/మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ది చేయటానికి తోడ్పడతాయి. పొలంచుట్టూ 4 సాళ్ళు జొన్న రక్షితపైరుగా విత్తాలి.
పచ్చపురుగును తట్టుకునే ఐ.సి.పి.ఎల్.332, యల్.ఆర్.జి 41 రకాలను లేదా పురుగు ఆశించినప్పటికి తిరిగి పూతకు రాగల ఎల్.ఆర్.జి 30, ఎల్.ఆర్.జి 38 కంది రకాలను సాగు చేసుకోవాలి.
పైరు విత్తిన 90-100 రోజుల్లో చిగుళ్ళను ఒక అడుగు మేరకు కత్తిరించాలి.
ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
పురుగు గ్రుడ్లను, తొలి దశ పురుగులను గమనించిన వెంటనే 5% వేప గింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందు (అజాడిరక్టిన్)లను పిచికారి చేయాలి.
ఎకరాకు 200 లార్వాలకు సమానమైన యస్.పి.వి ద్రావణాన్ని లేక 400 గ్రాముల బాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటితో కలిపి వారం తేడాతో రెండు సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.
బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి. లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి.
రసాయనిక పురుగు మందులను విచక్షణా రహితంగా వాడరాదు.
పైన చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ/తొలి పూతదశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్. 2.0 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా డెల్టామిత్రిన్ 0.9 మి.లీ. లేదా ల్యాండాసైహలోత్రిన్ 1.0.మి.లీ. లేక ల్యుఫెన్యురాన్ 1.0 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఈ మందులు వాడిన తర్వాత రారము కూడా శనగ పచ్చ పురుగును నివారించలేక పోతే ఇండాక్సాకార్బ్ 1.0 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.8 మి.లీసు లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
Integrated Pest Management (gram pod borer)
Deep ploughing in summer will allow the larval stages of the insect to emerge and be eaten by birds.
Crop rotation should be done with crops that are less susceptible to this insect such as sorghum, soybean, sesame, millet, urad, and paddy.
Intercropping for 7 years in Kharif and 3 years in Rabi helps in increasing the number of parasites. Sorghum should be sown as a protective cover crop for 4 years around the field.
Cultivate varieties such as ICPL 332 and LRG 41, which are resistant to greenworm, or LRG 30 and LRG 38, which can return to flowering even after being attacked by the insect.
The tubers should be cut to one foot in length within 90-100 days of sowing.
4 pheromone traps should be installed per acre and appropriate crop protection measures should be taken after observing the presence of the insect.
20 bird nests should be established per acre to attract insect-eating birds.
Spray with 5% neem seed extract or neem-related drug (azadirachtin) as soon as the insect eggs and early stage insects are observed.
Spray NPV solution equivalent to 200 larvae per acre or 400 grams of bacterial drug mixed with 200 liters of water twice a week in the evening during winter.
The well-grown insects should be removed. Or the trees should be shaken well to destroy the insects that have fallen into the mats.
Chemical pesticides should not be used indiscriminately.
If the above measures cannot be taken in time, then depending on the pest intensity, apply 2.5 ml of chlorpyrifos during the bud/early flowering stage or 2.0 ml of quinalphos during the fruiting stage. Or Acephate 1.5 g. or Deltamethrin 0.9 ml. or Landacyhalothrin 1.0 ml. or Lufenuron 1.0 ml. should be mixed in a liter of water and sprayed. If the gram pod borer is still not controlled after using these drugs, spray with 1.0 ml of indoxacarb or 0.8 ml of spinosad per liter of water.
వైరస్ ని ఉపయోగించి చీడపురుగులను నియంత్రించటం / Controlling pests using viruses
వైరస్ ని ఉపయోగించి చీడపురుగులను నియంత్రించటం
వైరస్ ని ఉపయోగించి చీడపురుగులను నియంత్రించటం :
శనగపచ్చ పురుగు, ఆముదం మీద వచ్చే నామాల పురుగు, లద్దె పురుగు, కత్తెర పురుగులను నివారించటానికి న్యూక్లియార్ పాలిహెడ్రోసిస్ వైరస్ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు.
రైతులు స్వయంగా ఎన్.పి.వి. ద్రావణాన్ని తయారు చేసుకొనటం :
రైతులు పొలంలో వైరస్ వ్యాధి సోకి తలక్రిందులుగా వేలాడుతున్న శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగు లార్వాలను సేకరించుకోవాలి.
ఈ లార్వాలను ఒక పాత్రలోనికి తీసుకొని మంచి నీళ్ళు కలిపి మెత్తగా నూరి ద్రావణం తయారు చేసి పలుచని గుడ్డ ద్వారా వడపోయాలి. 200 వ్యాధిసోకిన పురుగుల నుండి వచ్చిన ద్రావణానికి 200 లీ. నీటిని, 1 కిలో బెల్లం మరియు 100 మి.లీ. టీపాల్ లేదా రాబిన్జూ చేర్చి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి.
టీఫాల్ లేదా రాబిన్జూ అందుబాటులో లేని పరిస్థితులలో తేలికపాటి సబ్బు ద్రావణాన్ని కూడా ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.
పైరులో అమర్చిన లింగాకర్షక బుట్టలోనికి 8-10 రెక్కల పురుగులు ఆకర్షించబడిన రెండు వారములలో గాని లేక పైరుపై పురుగు గ్రుడ్లను గమనించటం జరిగిన వారం రోజుల్లో వైరస్ ద్రావణాన్ని పైరుపై పిచికారి చేయాలి. పురుగుచర్మాన్ని తాకినట్లయితే వదులుగా వుండి చర్మం పగిలి శరీరం నుండి తెల్లని ద్రవం బయటకొస్తుంది.
ఎన్.పి.వి. ద్రావణం ఉపయోగించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు :
ఎన్.పి.వి. ద్రావణాన్ని మొక్క అంతటా సమంగా తడిచేట్లు పిచికారీ చేయాలి. పిచికారీ చేసేప్పుడు మధ్యమధ్యలో ద్రావణాన్ని కర్రతో బాగా కలపాలి. సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా వున్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి.
సూర్యరశ్మిగల సమయంలో పిచికారి చేసినట్లయితే సూర్యరశ్మిలో వున్న అతి నీలలోహిత కిరణాలు వైరస్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
ఎన్.పి.వి. ద్రావణం పిచికారీ చేసే ముందు మాత్రమే నీటితో కలిపి తయారు చేసుకోవాలి.
నిలువ వుంచిన ద్రావణాన్ని పిచికారి చేస్తే వైరస్ సామర్థ్యం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకొనవచ్చు
Controlling pests using viruses
Controlling pests using viruses:
Nuclear polyhedrosis virus solution controls gram pod borer, castor borer, leafhopper, and cutworm.
Farmers themselves prepare the NPV solutionFarmers should collect the infected groundnut and tobacco leafhopper larvae hanging upside down in the field.
These larvae should be taken in a container, mixed with clean water, made into a fine powder, and filtered through a thin cloth.. For the solution obtained from 200 infected insects, 200 liters of water, 1 kg of jaggery, and 100 ml of Teepal or Robinjoo should be added and sprayed in one acre of field.
A mild soap solution can also be used as an alternative when Tefal or Robinzoo are unavailable.
Spray the virus solution on the plant within two weeks of attracting 8-10 winged insects to the cocoon basket installed in the plant or within a week of observing insect eggs on the plant.
If the insect touches the skin, it will become loose and the skin will burst, releasing a white fluid from the body.
Precautions to be taken while using NPV solution :
Spray the NPV solution evenly all over the plant. Stir the solution well with a stick in between. Spray only in the evening when the weather is cool.
If spraying is done during sunny weather, the ultraviolet rays present in sunlight will reduce the virus's potency. NPV solution should be mixed with water only before spraying.
Spraying the stored solution reduces the virus potency. Spraying can be done 2-3 times at 10-day intervals as needed.