కంది పంటలలో సబ్సాయిలింగ్ ద్వారా ప్రయోజనాలు (ప్రయోగ ఫలితాలు) /Benefits of subsoiling in potato crops (experimental results)
కంది పంటలలో సబ్సాయిలింగ్ ద్వారా ప్రయోజనాలు (ప్రయోగ ఫలితాలు) /Benefits of subsoiling in potato crops (experimental results)
కంది పంటలలో సబ్సాయిలింగ్ ద్వారా ప్రయోజనాలు (ప్రయోగ ఫలితాలు)
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము తిరుపతిలో వ్యవసాయ ఇంజనీరింగువారు చేపట్టిన సబ్సాయిలింగ్ పై ప్రయోగాల ఫలితాలు పరిశీలిస్తే ఈ క్రింద విధంగా ఉన్నాయి.
సగం పొలంలో వర్షాధారిత కంది పంట విత్తనం నాటేప్పుడు సగం పొలంలో 2 మీ॥ ఎడంలో సబ్సాయిలర్ ద్వారా సుమారు 40-60 సెం||మీ నిలువుగా దున్నడం జరిగింది. మిగిలిన అన్ని పొలం ప్రక్రియలు, పొలమంతా సమానంగా పాటించడం జరిగింది.
పంట ఆగష్టు నెలలో నాటినప్పటికి నవంబరు, డిసెంబరు వరకు మామూలుగా సమానంగా కనబడినప్పటికి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాలలో ఎటువంటి వర్షాలు లేనందున ఈ క్రింది పంట మార్పు గమనించడం జరిగింది.
అనగా సబ్ సాయిలింగ్ చేసిన సగబాగంలో కంది పంటలో ఆఖరి (కాయ) దశలో వచ్చిన రెండు నెలలు బెట్టను కూడా తట్టుకొని పంట నికర దిగుబడిని నమోదు చేయబడింది.
అదే విధంగా సబ్ సాయిలింగ్ చేయని పొలంలో పంట బెట్ట పరిస్థితులనకు గురై పంట నష్టం భారీగా చేకూరింది.
Benefits of subsoiling in potato crops (experimental results)
The results of experiments on subsoiling conducted by agricultural engineers at the Regional Agricultural Research Station, Tirupati, are as follows.
While sowing the rainfed redgram seed in half the field, a 2 m deep subsoiler was used to plough the field to a depth of about 40-60 cm. All other field practices were followed uniformly throughout the field.
Although the crop was sown in August and looked normal till November and December, the following crop change was observed due to the absence of any rains in December, January and February.
This means that in the half of the sub-soiled area, the net yield of the crop was recorded even after two months of the final (fruit) stage of the redgram crop. Similarly, the crop in the field where sub-soiling was not done was exposed to poor conditions and suffered heavy crop losses.
సబ్సాయిలింగ్ (నేలలో గట్టి పొరలను ఛేదించడం).
40 సెం.మీ.ల నుండి 60 సెం.మీ.ల లోతుకు నిటారుగా దున్ని భూమిలోని గట్టి పొరను ఛేదించవచ్చు.
ఇలా చేయడం వలన పొలంలో పడిన వర్షపు నీరు ఛేదించిన సాళ్ళద్వారా అదే పొలంలోనే ఇమిడి తేమను నిల్వ ఉంచేందుకు రిజర్వాయరులాగా తోడ్పడుతుంది.
ఈ విధంగా సబ్సాయిలింగ్ ద్వారా భూమి లోపల (40-60 సెం.మీ. వరకు) గుల్ల బార్చడం ద్వారా పంట మొక్కల వేర్లను లోపలి వరకు వృద్ధి చేసుకునేందుకు దోహదపడుతుంది.
వేర్ల వృద్ధి ఎక్కువగా జరగడం ద్వారా లోపలి పొరలలోని తేమను పొంది పంట పటిష్టంగా తయారై ఎక్కువ రోజులు బెట్టను తట్టుకోగలుగుతుంది.
Subsoiling (breaking through hard layers of soil)
A straight plow to a depth of 40 cm to 60 cm can break through the hard layer of soil.
By doing this, rainwater that falls on the field is absorbed by the broken roots within the field, acting as a reservoir to store moisture.
In this way, subsoiling helps the roots of the crop plants to grow deeper into the soil (up to 40-60 cm).
Increased root growth allows the crop to absorb moisture from the inner layers, making it stronger and able to withstand drought for longer periods.
సబ్సాయిలింగ్ చేయడం ద్వారా పంట వేర్లు భూమిలోపలి వరకు వ్యాప్తి చెంది నేలలోని తేమ మరియు పోషకాలను తీసుకొనేందుకు దోహదపడుతుంది. ఇలా లోపలి వరకు నేలను గుల్లబార్చడం వలన వేర్ల ద్వారా ఆక్సిజన్ను పీల్చుకునేందుకు ఉపయోగపడుతుంది.
సబ్బాయిలింగ్ (40-60 సెం.మీ.వరకు) సబ్సాయిలర్ అనే నాగలితో సమర్థవంతంగా చేయవచ్చును. దీని ఖరీదు రూ. 15,000/- నుండి రూ.35,000/- వరకు ఉంటుంది.
ఈ సబ్సాయిలర్ వాడకాన్ని సాధారణంగా ఉపయోగించే 40 హెచ్.పి. ట్రాక్టరు శక్తి సరిపోతుంది. ఈ పరికరాన్ని ఉపయోగించి ఒక ఎకరం పొలాన్ని సుమారు 1.30 గంట సమయంలో కావలసిన లోతైన 1 మీటరు దూరంలో సాళ్ళను పొందవచ్చును.
Subsoiling allows the roots of the crop to penetrate deep into the soil, allowing them to absorb moisture and nutrients. This deep tilling of the soil helps the roots absorb oxygen.
Subsoiling (up to 40-60 cm) can be done effectively with a plough called a subsoiler. Its cost ranges from Rs. 15,000/- to Rs. 35,000/-.
The power of a commonly used 40 HP tractor is sufficient for the use of this subsoiler. Using this device, one acre of land can be ploughed at the required depth of 1 meter in about 1.30 hours.